- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
12ఏళ్ల చిన్నోడి ఆర్ట్ ఫుల్ ఫేమస్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
దిశ, ఫీచర్స్ : చాలామంది చిన్నారులు ఎక్కువగా బొమ్మలు గీయడం, వాటికి రంగులు వేయడంపై ఆసక్తి చూపిస్తుంటారు. కానీ పేరెంట్స్ మాత్రం అవేం పిచ్చి గీతలంటూ వారిని ప్రోత్సహించకుండ ఎగతాళి చేస్తుంటారు. ఆర్ట్ వేయడం వల్ల వారిలో ఊహశక్తి పెరుగుతుందని, సృజనాత్మకంగా ఆలోచించేందుకు దోహదం చేస్తుందని మాత్రం గ్రహించరు. ఓ 12 ఏళ్ల చిన్నోడు తన ఆర్ట్ స్కిల్స్‌తో సంపాదించిన మొత్తం తెలిస్తే మరోసారి పిల్లలు గీసే పెయింటింగ్స్, ఆర్ట్‌ను మెచ్చుకోకుండా ఉండలేరంటే నమ్మండి.
లండన్‌కు చెందిన బెన్యామిన్ అహ్మద్‌కు డిజిటల్ ఆర్ట్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే అతడు తొలిగా మైన్‌క్రాఫ్ట్ తరహా బొమ్మలు వేసి నాన్-ఫంజిబుల్ టోకెన్(ఎన్‌ఎఫ్‌టీ)గా వాటిని విక్రయించాడు. తన రెండో ప్రాజెక్ట్‌గా ‘వియర్డ్ వేల్’ పేరుతో భిన్నమైన థీమ్స్‌తో తిమింగళాలు చిత్రాలు గీయడం ప్రారంభించాడు.
ప్రసిద్ధ పిక్సలేటెడ్ వేల్ మీమ్ ఇమేజ్ ప్రేరణతో బెన్యామిన్ మొత్తంగా 3,350 ఎమోజీ టైప్ తిమింగలాల కలెక్షన్ రూపొందించడానికి తన సొంత ప్రొగ్రామ్ ఉపయోగించడం విశేషం. ఇందుకోసం ఓపెన్ సోర్స్ పైథాన్ స్క్రిప్ట్‌ను ఉపయోగించి ప్రోగ్రామ్ రాసుకున్నాడు. ఐదు సంవత్సరాల వయసు నుంచే బెన్యామిన్ కోడింగ్ నేర్చుకుంటూ దానిపై పట్టు సాధించాడు.
ఈ ఏడాది ప్రారంభంలో ఎన్‌ఎఫ్‌టీల గురించి తెలుసుకున్న బెన్యామిన్, ఎన్‌ఎఫ్‌టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలో ఎన్‌ఎఫ్‌టీలో తొలిగా తన 40 పిక్సలేటెడ్ వెర్షన్ కలెక్షన్ ‘మైన్‌క్రాఫ్ట్ యీ హా’(Minecraft Yee Haa)ను విక్రయించగా, తన రెండో ప్రాజెక్ట్ పిక్సలేటెడ్ డిజిటల్ వేల్ ఎమోజీ కలెక్షన్‌ను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో రూ. 2 కోట్ల 93 లక్షలకు విక్రయించాడు.
అంతేకాదు ఆ కుర్రాడు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండేందుకు న్యాయవాదుల సలహాలు కూడా పొందాడు. అలాగే తన సొంత డిజైన్లను ఎలా ట్రేడ్‌మార్క్ చేయాలో సలహా తీసుకున్నాడు. ప్రస్తుతం తను ‘సూపర్ హీరో’ కలెక్షన్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడు.
‘స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, తైక్వాండోతో పాటు మరిన్ని అభిరుచుల గురించి యూట్యూబ్ వీడియోలను రూపొందిస్తుంటాను. ఇక డిజిటల్ ఆర్ట్ విభాగంలోకి తమ పిల్లలను ప్రోత్సహించాలనుకునే తల్లిదండ్రులు కోడింగ్ నేర్చుకోమని వారిని బలవంతం చేయవద్దు. వాళ్లు ఒత్తిడికి గురవుతారు. మీకు వంట చేయడం ఇష్టం, వంట చేయండి, మీకు నృత్యం చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే.. అదే చేయండి. అంతేకానీ ఒకరితో పోల్చుకోని నచ్చని పని చేయొద్దు. ఒకవేళ కోడింగ్ ఇంట్రెస్ట్ మాత్రం ప్రతిరోజు అరగంటపైనే దానికోసం కేటాయిస్తే తక్కువ సమయంలోనే ఈజీగా నేర్చుకోవచ్చు.
– బెన్యామిన్