- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ విషయంలో మోడీ చేసిన పని నిజంగా సిగ్గుచేటు.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాలకు వస్తారు కానీ అఖిలపక్ష సమావేశాలకు రారు అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress National President Mallikarjuna Kharhe) ఆరోపించారు. రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్ (Jaipur)లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమావేశానికి ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. బీజేపీ ప్రభుత్వం (BJP Government)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముందుగా పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో మరణించిన వారికి నివాళులు (Tributes) అర్పించారు.
అనంతరం దేశం పరువు తీసే సహాసం ఎవరైనా చేయాలని చూస్తే వారికి తగిన బుద్ది చెప్పేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ (PM Narendra Modi) హాజరుకాకపోవడం మన దేశ దౌర్భాగ్యం అని అన్నారు. అంతేగాక ప్రధాని పదవిలో ఉండి రాకపోవడం నిజంగా సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మోడీకి బీహార్ లో ఎన్నికల ప్రసంగాలు చేసేందుకు సమయం ఉంటుంది కానీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడానికి సమయం లేదని ఎద్దేవా చేశారు. బెంగుళూరులో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని అఖిలపక్ష సమావేశం (All Party Meeting) ఏర్పాటు చేయాలని చెప్పినట్లు గుర్తు చేశారు.
ఎందుకంటే దేశ ఆత్మ గౌరవానికి భంగం కలిగినప్పుడు మనందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించానని చెప్పారు. ఇక ఈ సమావేశంలో ప్రధాని తదుపరి తీసుకోబోయే చర్యలకు సంబంధించిన ప్రణాళిక గురించి చెప్పడమే గాక, ప్రజల నుంచి సలహాలు కూడా తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అంతేగాక కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాటు చేసి, అందులో కేంద్రం తీసుకోబోయే ఏ చర్యకైనా తమ మద్దతు ఉంటుందని తీర్మానించామని చెప్పారు. ఇక ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము అండగా ఉంటామని అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పామని ఖర్గే వెల్లడించారు.