- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అవన్నీ ఉత్త ముచ్చట్లే.. కారులోనే నేను : తుమ్మల
దిశ ప్రతినిధి, ఖమ్మం : గత కొద్దిరోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నట్లు వస్తున్న కథనాల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టంచేశారు. అయితే, తుమ్మల కారు దిగి కాషాయ కండువా కప్పుకోనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీనికి తోడు మంగళవారం ఖమ్మం జిల్లాకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో తుమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టడంపై ఆయన వర్గీయులు భగ్గుమన్నారు. తుమ్మలను కించపరిచేలా ఆ పోస్టులు ఉండటంతో అనుచరులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
బుధవారం మధ్యాహ్నం ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. తనను దూషిస్తూ, పార్టీ మారుతున్నట్లుగా పెట్టిన పోస్టుల ప్రతులను సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌కు అందజేశారు. సైబర్ కేసుగా పరిగణించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మాజీ మంత్రి తుమ్మల విలేఖరులతో మాట్లాడారు. పార్టీ మారాల్సిన దుస్థితి తనకేమీ పట్టలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం తనకు సంతోషానిస్తుందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓడిపోయి ఇంట్లో ఉన్న తనను సీఎం కేసీఆర్ అసాధారణ స్థితిలో గౌరవిస్తూ మంత్రి పదవి ఇచ్చి కేబినేట్‌లోకి తీసుకున్నారని గుర్తు చేశారు.
తాను ఏ పార్టీ నుంచి పనిచేసినా అంతిమంగా ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 40ఏళ్లుగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తనకు అన్ని రకాల రాజకీయాలు తెలుసునని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, జీహెచ్ ఎంసీ, ఖమ్మం కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తాను పనిచేస్తానని మరోసారి తుమ్మల పునరుద్ఘాటించారు.