- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSRTC : వేధింపులు ఆపి వేతన సవరణ చేయండి
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ జరపడంతో పాటు జూన్ నుంచి అమలవుతుందని, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు కూడా వేతన సవరణ చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. బాబు, రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్7వ ఆవిర్భావ దినోత్సవ వేడులను ఆ యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు ఈరోజు వరకు వేతనాలు రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కరోనా సమయంలో డ్రైవర్లు, కండక్టర్లను ఈపీకే, కేఎంపీఎల్, ఓఆర్ పేరుతో ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు. డీఏ బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ఉప ప్రధానకార్యదర్శి వెంకన్న, సహాయ కార్యదర్శి జక్కరయ్య, గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధ్యక్ష, కార్యదర్శలు మజీద్, రాఘవులు, కిషన్ గౌడ్, జనార్ధన్, బంగారం, పర్వతాలు, ఆగమయ్య, కార్మికులు పాల్గొన్నారు.