- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వినియోగదారుల ముంగిట్లోకే టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలు వినియోగదారులకు మరింత చేరువ కానున్నాయి. జంటనగరాలల్లో ప్రారంభమైన హోం డెలివరీ సేవల్ని మరిన్ని జిల్లాల్లో విస్తృతం చేస్తోంది. ఆయా జిల్లాల్లో హోం డెలివరీ ద్వారా ఇంటింటికీ, షాపులకు పార్సిల్ అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు బస్టాండు నుంచి బస్టాండు వరకే పార్సిళ్లు చేరవేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ సేవల ద్వారా ఇళ్లు, షాపులు, కార్యాలయాలకు తీసుకెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులు ఇక తీరనున్నాయి. అంతకు ముందు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమైన హెం డెలివరీ సేవలు నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలోనూ తాజాగా అందుబాటులోకి వచ్చాయి.
వినియోగదారులు బుకింగ్ చేసుకునే సమయంలో హోం డెలివరీ సేవల్ని కోరినట్లయితే ఆ మేరకు బస్టాండ్ల నుంచి నేరుగా పార్సిల్స్‌ను ఇంటి వద్దనే అందజేసే విధంగా ఆయా ఏజెన్సీలతో టీఎస్ ఆర్టీసీ కార్గో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో బెంగుళూరులోని 10 ముఖ్య పాయింట్లలో హో డెలివరీ సేవలతో పాటు పికప్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వ్యాపార కేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం పట్టణాలకు నేరుగా నిత్యం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ మీదుగా కార్గో సర్వీసులను నడుపుతోంది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సంస్థలోని మానవ వనరులను ఉపయోగిస్తూ టీఎన్ ఆర్టీసీ కార్గో ఉత్తమ సేవలు అందిస్తోందని అన్నారు.
వినియోగదారులకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో డోర్ టు డోర్ డెలివరీ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రస్తుతం ఆయా జిల్లాల్లో వినియోగదారుల డిమాండును దృష్టిలో పెట్టుకుని కార్గో, పార్సిల్ సేవల్ని విస్తృతం చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. బుక్ చేసిన పార్సిల్స్ ఆయా బస్టాండులకు చేరుకున్న తరువాత కూడా వినియోగదారులు హోం డెలివరీ కావాలని ఫోన్ చేసి చెప్పినా నేరుగా వారి ఇంటి వద్ద అందజేస్తున్నట్లు వివరించారు. ఈ సేవల ద్వారా వినియోగదారులకు సమయం, రాకపోకల ఖర్చు తగ్గుతుందన్నారు. పార్సిల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 36.95 లక్షల పార్సిల్స్ చేరవేయడం ద్వారా రూ.52.31 కోట్లు సంస్థ ఆర్జించడం జరిగిందని వివరించారు.