‘కొండ పోచమ్మ’ ప్రారంభోత్సవానికి వారొచ్చారు

by Shyam |
‘కొండ పోచమ్మ’ ప్రారంభోత్సవానికి వారొచ్చారు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మ బ్యారేజీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ తరపున విద్యుత్ సంస్థల ఎండీలు పాల్గొన్నారు. రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నవారిలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఎండీ రఘమారెడ్డి, టీఎస్‌ఎన్పీడీసీఎల్ ఎండీ అన్నమనేని ప్రభాకర్ రావు, విద్యుత్ సంస్థలకు చెందిన ఇతర ఉన్నతాధికారులున్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మర్కుక్, అన్నారం లాంటి అతి భారీ పంపుహౌజులకు వేల మెగావాట్ల విద్యుత్‌ను అందించడానికి విద్యుత్ శాఖ కృషి ఎంతగానో ఉందని ప్రాజెక్టు వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పొగిడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed