ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

by Shyam |
gurukulam
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసి గురుకుల జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. నేడు ప్రవేశ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. ర్యాంక్ కార్డ్‌లను డౌన్ లోడ్ చేసుకోవల్సిందిగా తెలంగాణ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి సిహెచ్‌ రమణ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత సాధించిన విద్యార్ధులకు కేటాయించిన కళాశాలల్లో ఈ నెల 30న సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈనెల 14న మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

Advertisement

Next Story