నీ సినిమా చూడటం కంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినడం బెటర్ అంటూ నెటిజన్ ట్వీట్‌.. యంగ్ హీరో రియాక్షన్ ఇదే..

by Kavitha |   ( Updated:2025-04-13 15:16:17.0  )
నీ సినిమా చూడటం కంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినడం బెటర్ అంటూ నెటిజన్ ట్వీట్‌.. యంగ్ హీరో రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) జంటగా నటించిన మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్‌(Bharath)లు తెరకెక్కించారు. ఇక ఇందులో సత్య(Sathya), గెటప్ శ్రీను(Getup Srinu), వెన్నెల కిశోర్(Vennela Kishore), మురళీధర్ గౌడ్(Muralidhar Goud), సుందర్, జాన్ విజయ్, రోహిణి, ఝాన్సీ వంటి వారు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 11న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

ఈ క్రమంలో సోషల్ మీడియా(Social Media) వేదికగా ఓ నెటిజన్ ప్రదీప్‌ సినిమాపై ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘ప్రదీప్ కోసం మూవీకి వెళ్దాం అనుకున్నా, కానీ ఆ రివ్యూస్ చూశాక నా డబ్బులు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మంచిగా అదే పైసలతో బిర్యానీ ఆర్డర్ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో కోర్ట్ సినిమా చూసుకుందాం’ అని రాసుకొచ్చాడు. ఇక ఆ నెటిజన్‌ ట్వీట్‌కు ప్రదీప్ మాచిరాజు స్వీట్ రిప్లై ఇచ్చాడు. ‘ఏం పర్లేదు భయ్యా ఒకసారి ట్రై చెయ్.. సరదాగా నవ్వుకొని వచ్చేయ్.. చూశాక చెప్పు భయ్యా బిర్యాని కూడా నేనే పంపిస్తా’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story