- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సోషల్ మీడియా వేదికగా దేశంలో విధ్వంసాలు, అల్లర్లకు కుట్ర

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో విధ్యంసం సృష్టించాలనే ఆలోచనతో ఇటీవల కాలంలో ఉగ్రవాదులు (Terrorists) అనేక పన్నాగాలు పన్నుతున్నారు. అయితే భారత రక్షణ వ్యవస్థ కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడంతో వారి ఎత్తులు సాగడం లేదు. దీంతో దారి మార్చిన ఉగ్రమూకలు.. సోషల్ మీడియా (Social media) ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని ఏటీఎస్ గుర్తించింది. సిగ్నల్ మొబైల్ యాప్ (Signal Mobile App)లో అల్ మౌత్ ఉల్ (Al-Mouth-ul) పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసి భారత్‌లోని ఓ వర్గానికి చెందిన యువకులను రెచ్చగొడుతున్న ట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు (ATS officials) గ్రూప్ సభ్యుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు గ్రీన్ బర్డ్స్, స్ట్రేంజర్స్ గ్రూపుల ద్వారా.. దేశ వ్యతిరేక కార్యకలాపాల (Anti-national activities)కు పాల్పడినట్టు గుర్తించారు. అలాగే భారత్‌లో అల్లర్లు, విద్వంసం (Riots and destruction in India) సృష్టించడమే లక్ష్యంగా చేసుకొని ఈ గ్రూపులను క్రియేట్ చేసినట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు.