- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటర్ రిజల్ట్స్.. 892 మార్కులు వచ్చినా విద్యార్థిని ఫెయిల్

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నిన్న(శనివారం) ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. మొదటి సంవత్సరం 70 శాతం, రెండవ సంవత్సరం 83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి లోకేశ్ శనివారం ఉదయం 11గంటలకు విడుదల చేశారు. గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదే నమోదైంది.
ఇదిలా ఉంటే.. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పటమటకు చెందిన విద్యార్థిని రాజేశ్వరికి ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 892 మార్కులొచ్చినా ఫెయిలైంది. ఆమెకు సంస్కృతంలో 98, మ్యాథ్స్ 2Aలో 73, 2Bలో 75, ఫిజిక్స్ లో 60, కెమిస్ట్రీలో 60, 2 ప్రాక్టికల్స్ లో 60 మార్కులు రాగా.. ఇంగ్లీష్‌లో 5 మార్కులే వచ్చినట్లు మార్కుల లిస్టులో చూపిస్తోంది. కష్టపడి చదివినా ఇంగ్లీషులో 5 మార్కులే రావడం పట్ల విద్యార్థిని కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే.. ఇంటర్ మొదటి సంత్సరంలో 470కి 461 మార్కులు వచ్చాయి. ఆమెకు మొదటి ఏడాది ఇంగ్లీష్ లో 100కు 94 మార్కులు వచ్చాయి. కానీ ఇంటర్ సెకండియర్ లో 5 మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టేందుకు విద్యార్థిని సిద్ధమవుతోంది.