- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్చకులు, దేవాలయ సిబ్బంది వేతనాలు విడుదల
దిశ, హైదరాబాద్ :
రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి త్రైమాసికానికి సంబంధించిన వేతనాలను మంజూరు చేసింది. ఈ మేరకు ఎండోమెంట్ శాఖ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండోమెంట్ శాఖ పరిధిలో 646 దేవాలయాలు ఉండగా, అందులో సుమారు 5,200 మంది అర్చకులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 2014 కంటే ముందు నుంచి పనిచేస్తున్న సుమారు 2800 మందికి ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల నుంచి ప్రతి నెలా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రస్తుతం ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాల మొత్తానికి ఒకేసారి దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. వీరి వేతనాలకుగాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.120 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన ప్రభుత్వం.. అందులో నుంచి మొదటి మూడు మాసాలకు వేతనాల కింద రూ.30 కోట్లను మంజూరు చేసింది. వీటిని ప్రతినెలా వేతనాల రూపంలో సిబ్బందికి చెల్లించాల్సి ఉంటుంది.
Tags: Endowment dept, Grant in Aid funds, budget, Priests staff