- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'శంషాబాద్‌లో నా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు'
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ప్రాంతంలో భూ మాఫియా రెచ్చిపోతుంది. సాక్షాత్తూ ఓ కేంద్ర మాజీ మంత్రి కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సాతంరాయి వద్ద విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు జయప్రకాష్ స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. ఈ విషయాన్ని శంషాబాద్ పోలీసులకు మూడు నెలల కింద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి నెల ముందు నిందితులను అరెస్టు చేసి వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే తిరిగి సోమవారం అర్ధరాత్రి ప్రహరీ గోడను కూల్చివేశారు. దీంతో బాధితుడు మళ్లీ పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని సీఐ విజయ్ కుమారు తెలిపారు. అయితే పోలీసులు సరైనా విధంగా స్పందించటం లేదని బాధితుడు జయప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ వివరాల ప్రకారం శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద 1997 లో సర్వే నంబర్ 725/ 15 లో ఎకరన్నర భూమిని జయప్రకాష్ రెడ్డి కొనుగోలు చేశారు. ఆ భూమిని కబ్జా చేసేందుకు హైదరాబాద్ కు చెందిన ఓ ముఠా ప్రయత్నిస్తుంది. ఆ ముఠా ఇప్పటికే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నారని చెప్పాడు.