టీఆర్ఎస్ ఓటమి తప్పదు …..

by Shyam |
టీఆర్ఎస్ ఓటమి తప్పదు …..
X

దిశ ప్రతినిధి, మెదక్:
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తప్పదని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ( టీజీఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్ తెలిపారు. ఈ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోతే నరేశ్‌కు చివరి వరకు తమ ఫోరం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. యావత్ తెలంగాణ ప్రజలను కేసీఆర్ నమ్మించి నట్టేట ముంచిన సంగతి అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ తిరిగి ప్రచారం చేస్తామని చెప్పారు. నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు కూడా ఆలోచించి మీ ఇంట్లో ఒక్క నిరుద్యోగి పోటీ చేస్తున్నాడని భావించి మా అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. నిరుద్యోగులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రభుత్వానికి నిరుద్యోగుల బాధ ఏమిటో తెలియజేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed