- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబును దూషించిన వారిని లేకుండా చేస్తే యాభై లక్షలిస్తా (వీడియో)
దిశ, ఖమ్మం టౌన్: ఏ పార్టీలో ఉన్నా ఆ కులం మొత్తం ఒక్కటే అని వారి మాటల్లో మరోసారి రుజువైంది. మొన్న ఆంధ్రా అసెంబ్లీలో జరిగిన చంద్రబాబు, వైసీపీ నేతల మధ్య జరిగిన మాటల యుద్ధం, ఇప్పుడు ఆంధ్రా సరిహద్దు అయిన ఖమ్మం జిల్లాకు తాకింది. తమ కులం నాయకుడిని దుర్భాషలాడిన వారిని భౌతికంగా లేకుండా చేస్తే, తన తరుపున రూ.50 లక్షలు ఇస్తానడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా మధిర కమ్మ కుల భోజనాల్లో స్థానిక టీఆర్ఎస్ వార్డు మెంబర్ మల్లాది వాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తమ కులం నాయకుడని, ఆంధ్రా అసెంబ్లీలో బాబు క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడారని, అంతేగాకుండా.. ఆయన్ని కించపరిచి మాట్లాడారని, అలా చేసిన వారిని భౌతికంగా లేకుండా చేస్తే, నా తరపున రూ.50 లక్షల బహుమానం అందజేస్తానని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో భౌతిక దాడులకు తెగపడేందుకు తమ సామాజిక వర్గం సిద్ధమవుతున్నదని తెలిపారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసిన వాసు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మేధావులు భావిస్తున్నారు.
మల్లాది వాసు చేస్తోన్న వైన్ షాప్స్, మిర్చీ వ్యాపారం, సుబాబుల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్లలో తమ సామాజిక వర్గం వారే పని చేస్తున్నారా? అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. బాబుపై అంత ప్రేమ ఉన్నప్పుడు టీడీపీనీ వీడి కాంగ్రెస్‌లోకి, కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లోకి ఎందుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. యూఎస్‌లో తమ కులం వారు మాత్రమే తన పిల్లలకు ఉద్యోగాలు కల్పించారా? అంటున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనను యావత్తు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని, వివాదాస్పద వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన వాసుని పార్టీని నుంచి సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.