వీణవంకలో టెన్షన్.. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ (వీడియో)

by Sridhar Babu |   ( Updated:2021-10-29 23:29:23.0  )
TRS vs BJP Veenavanka
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల ఘర్షణలు జరుగడంతో భారీగా పోలీసులు రంగప్రవేశం చేశారు. తాజాగా.. వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలో అనుకూలంగా ఓట్లు వేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed