- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ నిర్ణయం దుబ్బాకలో పంక్చర్ ఎఫెక్టా…?
దిశ ప్రతినిధి, హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు తథ్యమని భావించి విజయం ముంగిట బొక్క బోర్ల పడిన అధికార టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే విధంగా పావులు కదుపుతోంది. గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉండగా పార్టీ ఇప్పటికే అన్ని డివిజన్లకు ఇన్ చార్జిలను నియమించింది. అయితే కొన్ని డివిజన్లకు ఇద్దరేసి పార్టీ పరిశీలకులను నియమించడం వెనుక మతలబు ఏమిటీ? అనేది చర్చనీయాంశమైంది. ఆయా డివిజన్లలో పార్టీ అభ్యర్థి బలహీనంగా ఉన్నారా? లేక బలమైన ప్రత్యర్థి ఉండడంతో వారిని ఓడించడానికి శక్తి యుక్తులు పన్నేందుకు ఇద్దరిని నియమించారా అనేది చర్చలలో భాగమైంది.
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని సనత్ నగర్ డివిజన్ లో పార్టీ ఏకంగా ముగ్గురు పరిశీలకులను నియమించింది. ఇది ప్రస్తుతం పార్టీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ విజయం అంత సులభం కాదనే ప్రచారం జరుగుతుండగా మంత్రి పట్ల ఉన్న వ్యతిరేకత ఎదుటి వారికి అవకాశం కల్పించకూడదని పార్టీ అధిష్ఠానం ఇక్కడ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి కూడా ముగ్గురు పార్టీ పరిశీలకులను నియమించారు. ఇక్కడ కూడా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ప్రజల్లో వ్యతిరేకత కారణమని తెలుస్తోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, గ్రేటర్ టీఆర్ఎస్ ఎన్నికల రథ సారధి కేటీఆర్ ను కూడా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్ నగర్ కు ఎన్నికల పరిశీలకులుగా నియమించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ డివిజన్ ను మంత్రి కేటీఆర్ గతంలో దత్తత తీసుకున్నారు, దీంతో విజయమే లక్ష్యంగా ఆయనకు బాధ్యతలు అప్పగించారనే గుస గుసలు వినిపిస్తుండటంతో అసలు కారణం వేరే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.