- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటా : ఎంపీ నామా
దిశ, వెబ్‌డెస్క్ : మధుకాన్ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం మధుకాన్ స్థాపించాను. ఎంతో కష్టపడి ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా శ్రమించి దేశవ్యాప్తంగా మా కంపెనీలు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. చైనా బార్డర్‌లో కూడా మా కంపెనీలు రోడ్లు వేస్తున్నాయని తెలిపారు. అలాగే 2011లో రాంచీ ఎక్స్ప్రెస్ వే 160కిలోమీటర్ల ప్రాజెక్టు తో మొదలైంది. దీనిని ఎస్పీవీ కంపెనీ బీఓటీ పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టారని పేర్కొన్నారు.
ఎన్‌హెచ్‌ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చింది. నేను ఏ కంపెనీలో డైరెక్టర్‌గా లేను నా కంపెనీ వ్యవహారాాలను నా తమ్ముళ్లు చూసుకుంటున్నారని అన్నారు. నేను ఎవరినీ మోసం చేయలేదు, నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది, ప్రస్తుతం జరుగుతున్న విచారణకు పూర్తిగా మేము సహకరిస్తాం అని తెలిపారు. నేను 20 ఏళ్లగా ప్రజాజీవితంలో ఉంటున్నా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటాను, నా బలం కేసీఆర్, నా బలగం ఖమ్మం ప్రజలు అని పేర్కొన్నారు