ఉత్తమ్‌వి సోయితప్పిన మాటలు

by Shyam |
ఉత్తమ్‌వి సోయితప్పిన మాటలు
X

దిశ, న్యూస్‌బ్యూరో :
ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోయితప్పిన మాటలు మాట్లాడారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా ప్రతి నిమిషం రాజకీయం చేస్తున్నారన్నారు. సోమవారం అసెంబ్లీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ..ఉత్తమ్ తీరును కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం అసహించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. పాడిందే పాట అన్నట్లు ఆరేండ్లుగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన చరిత్ర తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకే చెల్లిందని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 203కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ఇంట్లో పోరు ఎక్కువై ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని కర్నె ప్రభాకర్ ఆరోపించారు. రేవంత్‌‌రెడ్డి అమరుల గురించి మాట్లాడితే నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.బడ్జెట్ సమావేశాల్లో ప్రతి శాఖలోని ప్రతి రూపాయితో లెక్కలు చూపించామని వివరించారు.

Advertisement

Next Story