- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాళ్లు మొక్కినా ఎవరొస్తలేరు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

దిశ, వెబ్ డెస్క్: సొంత ప్రభుత్వంపైనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైరయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విధంగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా చెవులుకొరుక్కుంటున్నట్లు సమాచారం. దీంతో ఆ ఎమ్మెల్యేలు చల్లా మాట్లాడింది వాస్తవమే అని అనుకుంటున్నారంట. ఆ వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు.
సర్కారు పనులంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారని, పనులు చేపట్టేందుకు ఎవరు కూడా ముందుకు రావడంలేదన్నారు. వరంగల్ లో అయితే కాళ్లు మొక్కినా కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్నారు. చేసిన పనులకు బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి దాపరించిందని.. నేను కూడా బిల్లుల కోసం తిరుగుతున్నానని ఆయన చెప్పారు. క్వాలిటీ పేరిట బిల్లులో 20 శాతం కట్ చేస్తే కాంట్రాక్టర్ బతకాలా? చావాలా? ఆయన అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.