‘బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలి’

by Sridhar Babu |
MLA Balka Suman
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలపై చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగరేణి ప్రాంతంలో బీజేపీ నేతలు దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు బీజేపీ నేతలు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి వ్యవహారాలపై సీబీఐ కాదు.. ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి అని సవాల్ విసిరారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం.. టీఆర్ఎస్ సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కేంద్రం నుంచి ఆదాయపు పన్ను మినహాయింపు ఇప్పించలేని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Next Story

Most Viewed