టీఆర్ ఎస్‌కు షాక్.. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఆ పదవికి రాజీనామా..

by Shyam |   ( Updated:2021-07-14 04:22:30.0  )
టీఆర్ ఎస్‌కు షాక్.. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఆ పదవికి రాజీనామా..
X

దిశ, నర్సాపూర్ : మెదక్ జిల్లా చిలిపి చెడు మండల జడ్పీటీసీ పదవికి బుధవారం నాడు చిలుముల శేషసాయి రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత‌కు, జిల్లా పరిషత్ సీఈఓ‌కు పంపారు. చిలిపి చెడు మండలంలో నూతన భవనం, జూనియర్ కళాశాల భవనం, పీహెచ్సీ సెంటర్, ఎల్ గుంటి తండా, మొండి తండా రోడ్డు నిర్మాణాలు వంటి విషయాలలో ఎమ్మెల్యే సఖ్యత లేకపోవడం కారణంగా పనులు జరగడం లేదని మనస్థాపం చెందిన జడ్పీటీసీ సభ్యుడు. టీఆర్ఎస్ గుర్తు పైన గెలిచినందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed