- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే సాక్షిగా సతుల స్థానంలో పతులు.. మారని టీఆర్ఎస్ నేతల తీరు..
దిశ, బాసర: రైతుల సంఘటిత నిర్ణయాల నిమిత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను ఆదివారం బాసరలో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాసర మండలంలో గల మహిళ నాయకురాలుల స్థానంలో వారి భర్తలను ఎమ్మెల్యే తన పక్కనే కూర్చోపెట్టుకొని, వారే ఆ నాయకులుగా వారిని సంభోదించడం పట్ల పలువురి విమర్శలకు గురయ్యారు.
ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి రైతు వేదిక ప్రారంభోత్సవ శిలాఫలకంపై తమ భార్యల పేరు ప్రారంభోత్సవానికి తమ భర్తలు హాజరు కావడం పట్ల మహిళా హక్కుల్ని స్వయానా ప్రజాప్రతినిధులే కాలరాస్తున్నారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తుంటే వారు నాయకులే అంటూ పలువురు వెనకేసుకొస్తున్నారు.
ఇటువంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు చెప్పినా ఆ పార్టీ నాయకులే పాటించకపోవడం గమనార్హం. బాసరకు రైతు వేదిక కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఎమ్మెల్యే జడ్పీటీసీ, ఎంపీపీ కోసం ముప్పై నిముషాలు వేచి చూశారు. తీరా చూశాక ఎంపీపీ జడ్పీటీసీ స్థానాల్లో వారి భర్తలు వచ్చారు. ఇది చూసిన ప్రజలు, రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు.