- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, మక్తల్ : నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ నాయకులు కండువాలు ధరించి పాఠశాల గదులోకి వెళ్లి.. ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పే వేదికను ఉపన్యాసానికి వాడుకున్నారు. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ నేతలు గుడిగండ్ల పాఠశాలను ప్రచారానికి వేదికగా వాడుకున్నారు. అలాగే జిల్లాలోని వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద కూడా పార్టీ కండువాలు ధరించి నేతలు ప్రచారం చేశారు.
అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లోకి, పాఠశాలలో గదుల్లోకి వెళ్లి ఓటు కలిగిన పట్టభద్రులను, ఉద్యోగస్తులను, టీచర్లను ఓటు వేయాలని పార్టీ అభ్యర్థులు కండువాలు ధరించి అడగకూడదు. ఇలా చేయడం ఎన్నికల నిబంధనలను ఉల్లఘించడం కిందకు వస్తుంది. కానీ ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీకి చెందిన నేతలు.. పాఠాలు బోధించే వేదికను ప్రచార వేదికగా చేసుకొని ప్రచారం నిర్వహించారు. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.