ఈటల కోటపై టీఆర్‌ఎస్ ఆపరేషన్.. వ్యూహం ఫలిస్తుందా?

by Shyam |
ఈటల కోటపై టీఆర్‌ఎస్ ఆపరేషన్.. వ్యూహం ఫలిస్తుందా?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మార్కును చెరిపేందుకు అధికార టీఆర్‌ఎస్ వ్యూహలు రచిస్తోంది. రాజేందర్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో ఇప్పటికీ అర్థం కాకపోయినప్పటికీ.. హుజురాబాద్‌లో మాత్రం ఆపరేషన్ క్లీన్ స్వీప్ జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ నేతలు ఈటల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్న గులాబీ దళం.. ఇతర పార్టీల నేతలను కూడా ఆకర్షిస్తోంది. ఇప్పటికే కమలాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ మెంబర్ టీఆర్ఎస్‌లో చేరగా.. తాజాగా హుజురాబాద్‌లోని బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. గులాబి నేతల తీరు చూస్తుంటే.. హుజురాబాద్ లో ఇతర పార్టీల ఊసే లేకుండా చేయాలన్న తాపత్రయం కనిపిస్తోంది.

ఈటల ఏ పార్టీలో చేరినా..

గత నాలుగు రోజులుగా ఈటల రాజేందర్ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకులతో చర్చలు జరిపారని, నేడో రేపో కాషాయం కండువా కప్పుకోవడం ఖాయమన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో జిల్లా టీఆర్ఎస్ నాయకుల కన్ను బీజేపీ ప్రజాప్రతినిధులపై పడింది. బీజేపీ తరుపున గెలిచిన వారిని తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటలతో ఇప్పటివరకు నడిచిన నేతలతో పాటు రానున్న రోజుల్లో ఆయన ఏ పార్టీలో చేరినా.. ఇతర నేతల మద్దతు ఉండకూడదనే వ్యూహంతో టీఆర్‌ఎస్ నేతలు ముందుకెళ్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed