- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దళిత బంధు’ కావాలా.. మేం చెప్పినట్టు చేయాలి.. నేతల డిమాండ్.!
దిశ, నిఘా ప్రతినిధి : దళితబంధు పేరు చెప్పి అధికార పార్టీకి చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల అరాచకాలు అప్పుడే మొదలయ్యాయి. పథకం మీకు కూడా వర్తించాలంటే మేం చెప్పినట్టు వినాలంటూ కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు హుకుం జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతీ దళితుని మెడలో గులాబీ కండువా.. ఇంటి ముందు ఫ్లెక్సీలు.. ఇంటిపైన పార్టీ జెండా ఉండాలంటూ షరతులు విధిస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అంతేకాదు మీకు రూ. 10 లక్షలు రావాలంటే మొదట కొంత డబ్బు కూడా కట్టాలంటూ దళారులు కూడా దిగుతున్నట్లు సమాచారం. పార్టీ కూడా మారాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు కొందరు దళితులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో కూడా పైలెట్ ప్రాజెక్ట్ కింద దళితబంధు వర్తింప చేయనున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం చింతకాని మండలం చిన్నమండువలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రికి తెలియకుండా కొందరు పార్టీకి చెందిన నాయకులు దళితుల వద్ద మొదటి విడతగా రూ. 500 వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసిన డబ్బులతో ఆ నాయకులు మంత్రి పర్యటన కోసం ఫ్లెక్సీలు, బ్యానర్లు తయారు చేయించినట్లు తెలుస్తోంది.
పార్టీ మారితేనే..
చిన్నమండువలో మంత్రి అజయ్ పర్యటన కోసం మొదటి విడతగా రూ.500 వసూలు చేసిన సదరు నాయకులు మరో విడతలో రూ.50 వేల వరకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మంత్రి వస్తున్న నేపథ్యంలో ప్రతీ ఇంటి ముందు టీఆర్ఎస్ ఫ్లెక్సీతో పాటు ప్రతీ ఒక్కరి మెడలో గులాబీ కండువా, ఇంటి పైన జెండా ఉండాలని లేకుంటే దళిత బంధు రాదని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇదంతా ఓ హోదాలో ఉన్న నాయకుడితో పాటు, స్థానిక నాయకుడు, అక్కడ ఇసుక దందాలో కీలకపాత్ర పోషించే ఓ వ్యక్తి, మరికొందరు కలిసి ఈ తంతుకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇదంతా మంత్రికి తెలియకుండా చేస్తున్నారని, వీరి చేష్టలతో ప్రభుత్వంతో పాటు మంత్రి అజయ్ ప్రతిష్టకు మచ్చ తెచ్చే అవకాశాలున్నాయని కొందరు దళితులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు దళితుల డబ్బులతో చేయించిన ఫ్లెక్సీలు అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన దళితులందరికీ దళిత బంధు వర్తింప చేస్తుంటే కొందరు గ్రామ, ద్వితీయ స్థాయి నాయకులు మాత్రం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను అబాసుపాలు చేస్తున్నారు.
ఒత్తిడి చేస్తున్న విషయం భట్టి దృష్టికి..
మధిర నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతలు పెద్దలకు తెలియకుండా వసూళ్లకు పాల్పడటంతో పాటు పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నట్లు సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఇదే విషయమై ఆదివారం రాత్రి భట్టి మాట్లాడుతూ.. దళిత బంధు దళితులందరికీ వర్తింపచేసే పథకమని, డబ్బులు వసూలు చేసే దళారులను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని చెప్పారు.