- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగుళూరు టు తిరుపతి.. TRS క్యాంపు షిఫ్ట్.. ఆరోజు రాత్రికి స్వస్థలాలకు నేతలు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన క్యాంపు బెంగుళూరు నుండి తిరుపతికి షిఫ్ట్ అయింది. బెంగుళూరు లీలా రిసార్ట్స్‌లో ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి, కాణిపాకం ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు ఆలయాల్లో దర్శనం చేసుకున్న తరువాత అదే ప్రాంతంలో ఓ రోజు అక్కడే బస చేసి ఆ తర్వాత హైదరాబాద్‌కు చేరుకుంటారు. 9వ తేది రాత్రి నుండి ఓటర్లను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
జోష్‌తో పాటు క్లాస్..
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల క్యాంపు టూర్‌లో ఓ వైపున ఎంజాయ్ చేసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించిన ఇంఛార్జీలు రోజుకోసారి వారికి ప్రత్యేకంగా క్లాసులు కూడా ఇస్తున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రత్యర్థుల మాటలు నమ్మి పార్టీకి ద్రోహం చేయవద్దని, అన్ని విధాల అండగా ఉంటామని కూడా వారికి వివరిస్తున్నారు. పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించుకోవడం వల్ల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని కూడా చెప్తున్నారు. మరో వైపున పార్టీ నాయకుల బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో పాటు నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ అభ్యర్థులు కూడా క్యాంపులోనే ఉంటూ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
- Tags
- camp