- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్రబెల్లి వివాదం.. సుధీర్ బాబుపై విమర్శలు
దిశ, కమలాపూర్ : మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలను కొన్ని చానెళ్లు, వార్త పత్రికలు వక్రీకరించాయని వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్‌బాబు అన్నారు. శనివారం కమాలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీడీవో పల్లవి గతంలో దుగ్గొండి మండల అధికారిణిగా పనిచేశారని అన్నారు. దుగ్గొండిలో చాలా చురుకుగా పని చేశారని, ఆ ఉద్దేశంతోనే తెలంగాణ భాషలో అభివృద్ధి పథంలో నడిపించాలనే అన్నారే తప్ప వేరే ఉద్దేశం కాదని వివరించారు. కొన్ని పత్రిక, చానళ్లు వారి సర్క్యులేషన్, రేటింగ్ పెంచుకోవడానికి మంత్రిపై వార్తలను ప్రసారం చేశాయని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఆయా పత్రిక మరియు చానల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా చానళ్లపై వార్తా సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అయితే, శుక్రవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మీడియా ముందుగానే మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని.. టీఆర్ఎస్ నేత సుధీర్ బాబు కప్పి పుచ్చే విధంగా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.