- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్‌ఎంటీని నగరం నుంచి తరలించొద్దు
దిశ ప్రతినిధి, మేడ్చల్: హెచ్ఎంటీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలని మేడ్చల్ మాల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం పబ్లిక్ సెక్టార్ కమిటీ చైర్మన్ కేశవరావును కలిసి వినతి పత్రం ఇచ్చారు. మెషీన్ టూల్స్ లిమిటెడ్- ప్రగా యూనిట్‌ను హైదరాబాద్ నుంచి తరలించకుండా చూడాలని ఆయన కోరారు. హైదరాబాద్ హెచ్ఎంటీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులను ఇతర రాష్ట్రాలలో ఉన్న యూనిట్లకు తరలి వెళ్లాలని సంస్థ నోటీసులు జారీ చేసిందన్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా సంస్థను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న కార్మికుల భవిత ప్రశ్నార్ధకంగా మారనుందని అన్నారు.
ఎన్నో దేశాల సంస్థలు హైదరాబాద్ పెద్ద కంపెనీలు నగరం వైపు చూస్తుంటే హెచ్‌ఎంటీని ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించడంపై రాజశేఖర్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికంగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు ఉన్నపళంగా వేరే రాష్ట్రానికి వెళ్లమన్నడం భావ్యం కాదన్నారు.