- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ కబ్జా : నేను కేటీఆర్ అనుచరుడిని.. నన్నెవరూ ఏం చేయలేరు?
దిశ, సిరిసిల్ల : టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్‌కు అనుచరుడినంటూ తన రక్త సంబంధీకులకు సంబంధించిన భూమిని కబ్జా చేసేందుకు ఎగబడుతున్న చోటా నేత వ్యవహారం సోమవారం తెర మీదికి వచ్చింది. భూమి హక్కు దారులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాసు పుస్తకంతో పాటు రైతుబంధు వస్తున్నప్పటికీ ఆ భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు సదరు టీఆర్ఎస్ నేత గత కొద్ది నెలలుగా అడ్డు పడుతున్నాడు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో భూమిని దున్నేందుకు భూ యజమాని వెళ్లగానే అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు అధికార బలంతో అడ్డుకుంటున్నారని వృద్ధ దంపతులు ఇద్దరూ మీడియా ముందు కన్నీరుమున్నీయ్యారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలో జరుగుతున్న కబ్జా తీరు అందరినీ ఆలోచనలో పడేసింది. కేటీఆర్ పేరిట జరుగుతున్న భూదందాను మీడియా ద్వారా మంత్రికి వివరిస్తూ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా మున్సిపల్ విలీన గ్రామం రగుడుకు చెందిన బూర ఎల్లయ్యది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడనీ పరిస్థితి. తనకున్న కాస్త భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఎల్లయ్యకు 1178,1179,1179/31,1179/7, 1179/31/1,1180/8 గల సర్వే నెంబరులలో 59 గుంటల భూమి ఉంది. గత కొన్నేళ్లుగా రైతుబంధు, క్రాప్‌లోన్ తీసుకుంటూ తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రగుడు నుంచి వెంకటాపూర్ వరకు రెండో బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రభుత్వం చేపట్టడంతో బైపాస్ రోడ్డు వెంబడి భూములకు మంచి గిరాకీ ఏర్పడింది.
దాంతో రగుడు గ్రామానికి వెళ్ళే దారిలో ఎల్లయ్య భూమి ఉండటంతో ఆ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. తమ భూమిని కబ్జా చేయాలని చూడటంతో ఏం చేయాలో తెలియని వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయా సర్వేనెంబర్‌లో ఉన్న భూమి బుర్ర ఎల్లయ్య చెందినదేనని తాను ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో అక్రమార్కులు ఎల్లయ్యకు సంబంధించిన భూమిలో సాగు చేయకుండా వ్యవసాయ యంత్రాల యాజమానులకు ఫోన్ చేసి బెదిరిస్తూ వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నాడు. వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో తెలియని దీనస్థితిలో వారు మీడియా ముందుకు వచ్చారు. తమది నిరుపేద కుటుంబం కావడం, అమాయకమైన తమ కుటుంబ సభ్యులను చూసి ఓ వ్యక్తి తమ భూమిని కబ్జా చేయడానికి పాల్పడుతున్నాడని, తాను మంత్రి కేటీఆర్ అనుచరుడని.. కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ మీరు ఎంత తిరిగినా ఏమీ చేయలేరని, అవసరమైతే మిమ్మల్ని చంపి అయినా మీ భూమిని లాక్కుంటనని అంటున్నాడని ఆ వృద్ధ దంపతులు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి ఆ వృద్ధ దంపతుల భూమిలో వ్యవసాయం చేసుకునేలా చూడాలని, సదరు తెరాస నేతతో వారికి ప్రాణభయం ఉందని మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు.