- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది: ఉత్తమ్ కుమార్
దిశ ప్రతినిధి, వరంగల్ : సీఎం కేసీఆర్ పతనం మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి అరెస్ట్‌కు నిరసనగా సెంట్రల్ జైలు ఎదుట భారీ ఎత్తున నిరసన చేపట్టేందుకు శనివారం కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, ఎంపీ కోమటిరెడ్డిని మడికొండలో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తమనెందుకు అడ్డుకుంటున్నారో తెలపాలని ప్రశ్నిస్తూనే వాహనాలు దిగి వరంగల్ వైపు కాలినడకన సాగారు.
ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెప్పండంతో…. తాము ర్యాలీ తీస్తున్నామని ఎక్కడా ప్రకటించలేదని, తాము నేరుగా సెంట్రల్ జైలు వద్దకు వెళ్తున్నట్లు ఉత్తమ్ ప్రకటించి వరంగల్ అర్భన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని ద్విచక్రవాహనంపై వెళ్లారు. అలాగే పోలీసుల తీరును ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని, కేసీఆర్ పాలన రజాకార్ల కంటే ఘోరంగా ఉందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.