- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హరీష్ రావు వ్యూహం.. సహకరించని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
దిశ ప్రతినిది, రంగారెడ్డి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏదీ ఏమైనప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేననే ధోరణిలో అగ్రనాయకత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు మంత్రి హోదాలోనున్న నాయకులను ఇన్‌చార్జీలుగా ప్రకటించిన విషయం విదితమే. ఆయా జిల్లాలోని మంత్రుల సమన్వయంతో ఇన్‌చార్జీలు ముందుకెళ్తున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అధిష్టానానికి చెప్పుకునేందుకు మాత్రమే అక్కడక్కడ ప్రచారం చేస్తున్నట్లు ఫొటోలు తీసుకోని సంబంధిత ఇన్‌చార్జీకి పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే క్షేత్రస్థాయి నాయకులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈవిషయం గమనించిన ఎన్నికల ఇన్‌చార్జీ హరీష్ రావు మంగళవారం సర్పంచ్‌లు, మున్సిపాలిటీ చైర్మన్లు, మేయర్లతో టెలికాన్ఫోరెన్స్లో మాట్లాడి ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశ నిర్ధేశం చేస్తున్నట్లు సమాచారం.
ప్రచారానికి దూరంగా ఎమ్మెల్యేలు..?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని టీఆర్ఎస్.. సభలు, సమావేశాలు, అంతర్గత వ్యూహాలతో ముందుకు పోతోంది. ఇలాంటి తరుణంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ పదువులు అనుభవించిన నేతలు అభ్యర్థి గెలుపునకు కృషి చేయడం లేదని ఆ పార్టీ సభ్యులే ఆరోపణలు గుప్పిస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ఏ గ్రామంలో పార్టీ సూచించిన విధంగా ప్రచారం జరుగడం లేదనే ప్రచారం సాగుతోంది. ఓటరును పార్టీ ఎన్నికల ఇన్చార్జీగా కలవకుండనే నగదు పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాలకు తప్పా నాయకులు, ఎమ్మెల్యేలు ఎక్కడ ప్రచారం కోసం తిరగడం లేదని తెలుస్తోంది. ప్రచారానికి పోయి పట్టభద్రుల చేత విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందనే వారు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి, చేవెళ్ల, వికారాబాద్ జిల్లాలో తాండూర్, కొడంగల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు భాగస్వామ్యం లేదని తెలుస్తోంది. కల్వకుర్తి నియోజకవర్గంలో జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణ రెడ్డిల వర్గపోరు బలంగా కనిపిస్తోంది. దీంతో వీరు ప్రచారం చేయలేకపోవుతున్నారు. అదే షాద్నగర్ ఎమ్మెల్యే ప్రచారంలో ఎక్కడ కనిపించడం లేదు. మిగిలిన వాళ్లు పార్టీలు మారుతారనే ప్రచారం నడుస్తున్నా నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
నేరుగా ఓటర్ల అకౌంట్‌కే..
టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఓటర్ల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఓటర్ల పేరు, అకౌంట్‌కు అనుసంధానమైన ఫోన్ నెంబర్లను స్వీకరిస్తున్నారు. దీని కోసం గ్రామాల్లో సర్పంచ్, పట్టణాల్లో మున్సిపాల్ చైర్మన్లు ఆ ప్రాంతాలకు సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్లు ప్రతి 25 మంది ఓటర్లకు ఓ ఇన్ చార్జీనిని నియమించి పట్టభద్రుల వివరాలను తీసుకుంటున్నారు. అలా నేరుగా ఓటర్ల అకౌంట్లోకే నగదు బదులాయింపు చేయాలనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నట్లు తెలిసింది.