‘రాజన్న’ సన్నిధికి దారేది.?

by Sridhar Babu |
‘రాజన్న’ సన్నిధికి దారేది.?
X

దిశ, వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. తిప్పాపూరం నుంచి ఆలయానికి వచ్చే ప్రధాన దారి వద్ద భారీకేడ్‌లతో మూసి వేయడంతో ఎలా వెళ్లాలో తెలియక భక్తులు అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా పట్టణ వాసులు తమ ఇండ్లలోకి వెళ్లేందుకు చుట్టూ తిరగాల్సి వస్తోంది. తిప్పాపూరం నుంచి వేములవాడ ఆలయానికి వెళ్లేందుకు రెండు వరుసల బ్రిడ్జి ఉన్నప్పటికీ బ్రిడ్జి దాటిన తరువాత ఆలయ ప్రధాన రోడ్లను బారీకేడ్‌లతో పోలీసులు మూసివేస్తున్నారు. దీంతో ఆలయానికి వెళ్లేందుకు జగిత్యాల బస్టాండ్, కోరుట్ల బస్టాండ్ నుంచి భక్తులు వెళ్లాల్సి వస్తోంది.

కనిపించని సూచీ బోర్డులు..

ఆలయానికి వచ్చే భక్తులకు సమాచారం తెలిసేందుకు ఎలాంటి సూచిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. ఆలయ ప్రధాన రహదారి మూసి ఉండడంతో ఎటు పోవాలో అర్థం కాక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా భక్తులు, పట్టణవాసుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని దారి ఓపెన్ చేయాలని పలువురు కోరుతున్నారు.

బంధువులను కూడా రానిస్తాలేరు..

ఊళ్లోకి వచ్చే రోడ్డును మూసివేసి, ఇంటికి వచ్చే చుట్టపోళ్లను కూడా పోలీసులు లోపలికి పంపిస్తలేరు. వాళ్లు ఫోన్ చేస్తే మేము అక్కడికి వెళ్లి చెప్పితే వదలిపెడుతున్నరు. దగ్గర ఉండేవాళ్లం వెళ్లగులుతాం, కానీ దూరం ఉన్న వారు అక్కడికి వెళ్లి చెప్పలేరు కదా.. రోడ్డు మూసివేయకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలె.

-నేరేళ్ల శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు

Advertisement

Next Story

Most Viewed