చెత్తకన్నా హీనంగా చూసేవాడు : సంజయ్ కూతురు

by Shyam |
చెత్తకన్నా హీనంగా చూసేవాడు : సంజయ్ కూతురు
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూతురు త్రిషాలా దత్ సోషల్ మీడియా పోస్టింగ్స్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేయడమే కాకుండా, ఇన్‌స్పిరేషనల్ స్టోరీస్ షేర్ చేస్తుంటుంది. కానీ ఈ సారి ఓన్ స్టోరీతో నెటిజన్స్ అటెన్షన్‌ను క్యాచ్ చేసింది త్రిషాల. పలు విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో సక్సెస్ అయిన భామ.. ఈ సారి తన పర్సనల్ లైఫ్‌లో టాక్సిక్ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయింది.

గతంలో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్న బాయ్ ఫ్రెండ్ దారుణంగా ప్రవర్తించేవాడని తెలిపింది. రోజులు గడిచే కొద్దీ మరింత అధ్వాన్నంగా తయారయ్యాడని.. తనను ఒక చెత్తలా ట్రీట్ చేసేవాడని చెప్పింది. ప్రతీరోజు కూడా బహుశా రేపు బాగుంటుందిలే అన్నట్లుగానే గడిచేదని, క్రమంగా పరిస్థితి మరింత దిగజారిందని చెప్పుకొచ్చింది. తన నుంచి ఎప్పుడైతే దూరంగా వచ్చేశానో అప్పుడే ఒక వ్యక్తిగా ఎదిగానని తెలిపింది. తనే ఆ పరిస్థితిని తెచ్చుకున్నానని.. తను అంగీకరించకపోతే అలా జరిగి ఉండేది కాదన్న త్రిషాల.. అలా ఆలోచించినప్పుడు సిగ్గేస్తుందని వెల్లడించింది. ‘కానీ ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని.. ఈ రోజు ఇక్కడున్నాను’ అంటూ తన గతాన్ని వివరించింది.

Advertisement

Next Story