- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'జెర్సీ' రీమేక్‌లో త్రిష ఫైనల్?
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ జెర్సీ. ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలో అన్ని ఎమోషన్స్‌తో కూడిన ఫెయిల్డ్ క్రికెటర్ జర్నీని హైలెట్ చేశారు. క్రికెటర్ లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్‌ను స్టోరీగా మలిచిన డైరెక్టర్.. తన స్క్రీన్‌ప్లే, టేకింగ్‌తో సినిమాను ఒక లెవల్‌లో నిలబెట్టారు.
దీంతో ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ముందుకొచ్చాడు హీరో షాహిద్ కపూర్. ఇంత గొప్ప ఎమోషనల్ జర్నీని ఒరిజినల్ ఫిల్మ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తేనే బాగుంటుందని.. గౌతమ్ తిన్ననూరికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.
కాగా ఇప్పుడు జెర్సీ సినిమా తమిళ్‌లో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో యంగ్ హీరో విష్ణు విశాల్ కథానాయకుడు కాగా.. హీరోయిన్‌గా త్రిష నటించబోతున్నట్టు సమాచారం. ఒక బిడ్డకు తల్లిగా నటనా ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో త్రిష ఓకే చెప్పేసిందట. విష్ణు విశాల్‌కు జోడీగా అమలా పాల్ నటిస్తుందని వార్తలు వచ్చినా.. త్రిషనే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.