‘పీకు’ రీమేక్‌లో స్మైలింగ్ క్వీన్

by Shyam |   ( Updated:2020-11-28 06:24:57.0  )
‘పీకు’ రీమేక్‌లో స్మైలింగ్ క్వీన్
X

దిశ, వెబ్‌డెస్క్ : స్మైలింగ్ క్వీన్ త్రిష మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘పీకు’ చిత్రం సౌత్‌లో రీమేక్ చేస్తుండగా.. దీపిక పాత్రలో త్రిష కనిపించబోతుందని సమాచారం. ఎంఎస్ఎం మోషన్ పిక్చర్స్, సరస్వతి ఎంటర్‌టైన్మెంట్స్ క్రియేషన్స్, రైజింగ్ సన్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ రీమేక్ రైట్స్‌‌ను బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ ప్రొడక్షన్ బ్యానర్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్న సదరు నిర్మాణ సంస్థ.. అమితాబ్ బచ్చన్, ఇర్ఫాన్ ఖాన్ పాత్రలు, కాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేయబోతుందని కోలీవుడ్ టాక్.

కాగా లైకా ప్రొడక్షన్స్‌లో వస్తున్న ‘రంగి’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న త్రిష.. జనవరి నుంచి మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. దీంతో పాటు మెహన్ లాల్ మలయాళ మూవీ రామ్‌ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయనున్న త్రిషా కృష్ణన్.. ఆ తర్వాత పీకు సినిమా చిత్రీకరణలో పాల్గొంటుందని తెలుస్తోంది.

Advertisement

Next Story