- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Ganpati Bappa Morya: గణపతి బప్పా మోరియా అని అంటాము కదా.. మరి ‘మోరియా’ అంటే ఏంటో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశమంతటా వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పూజ టైంలో లేదా నిమజ్జనం సమయంలో మనమందరం గణపతి బప్పా మోరియా అని అంటుంటాము. అయితే అందులో మోరియా అనే పదానికి అర్థం మాత్రం ఎవరికీ తెలియదు. మరి మోరియా అంటే అర్థం ఏంటి, అసలు అలా అనడానికి గల ఉన్న స్టోరి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
మోరియా అసలు కథ:
15వ శతాబ్దంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడట. అతను మహారాష్ట్ర(Maharashtra) లోని పుణెకు 21 కి.మీ. దూరంలో చించ్ వాడ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. ఇక గణపతిని పూజించేందుకు చించ్ వాడ్ నుంచి మోర్ గావ్‌కు రోజూ కాలినడకన వెళ్లేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించమని చెప్పాడట. దీంతో కలలో చెప్పిన విధంగానే మోరియా విగ్రహాన్ని నది నుంచి తీసుకుని వచ్చి ఆలయాన్ని స్థాపించాడు.
అయితే ఈ విషయం ఆనోటా.. ఈనోటా స్థానికులకు తెలిసింది. దీంతో మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా గోసావి మంగళమూర్తి అంటూ మొక్కారట. గణపతి ప్రతిమను నది నుంచి తెచ్చిన మోరియా గొప్ప భక్తుడు కాబట్టి అప్పటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసాని ఒక భాగంగా నిలిచిపోయారు. అందుకే భక్తులంతా గణపతి బప్పా మోరియా అని నినదించడం ఒక భాగంగా మారింది.