- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అందులో ఇన్వాల్వ్ అయిన అందరికీ శిక్ష పడాల్సిందే.. ‘అలకనంద’ ఆస్పత్రి ఘటనపై హెల్త్ మినిస్టర్ సీరియస్

దిశ, తెలంగాణ బ్యూరో: పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని డాక్టర్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. ఎల్బీనగర్ సమీపంలోని సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్‌లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతోందన్న వ్యవహారంపై మంత్రి ఆరా తీశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలించారు. అలకనంద హాస్పిటల్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో తనిఖీలు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు కోసం ఆరోగ్యశాఖ అధికారులతో ఇది వరకే టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలు మరింత పకడ్బంధీగా పనిచేయాలని, ఇలాంటి వ్యవహారాలను నిరోధించేలా కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. హాస్పిటల్స్‌లో జరిగే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టాలని పోలీస్ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.