Viral Video: మేడపైన ఆంటీని ఇంప్రెస్ చేయడానికి నానా తంటాలు పడుతున్న అంకుల్(వీడియో)

by Kavitha |
Viral Video: మేడపైన ఆంటీని ఇంప్రెస్ చేయడానికి  నానా తంటాలు పడుతున్న అంకుల్(వీడియో)
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విడ్డూరాలు అన్ని తెలిసిపోతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తే కొన్ని మాత్రం ఫన్నీగా అనిపిస్తాయి. బేసిక్‌గా అమ్మాయిలను ఇంప్రెస్ చెయ్యడానికి బాయ్స్ నానా తంటాలు పడతారు. మరి ఒక అంకుల్ ఆంటీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది?.. అది కూడా తన డాన్స్‌తో ఇంప్రెస్ చేయాలనీ చూస్తే.. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజాగా, ఓ వ్యక్తి మేడపై ఉన్న తన భార్యను ఇంప్రెస్ చేయడానికి వినూత్నంగా ఆలోచించాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో గోవిందా పాటను ప్లే చేసి, దానికి అనుగుణంగా మాస్ స్టెప్పులు వేయడం స్టార్ట్ చేశాడు. ''నీచే ఫూలోన్‌కి దుకాన్, ఊపర్ గోరీకా మకాన్''.. అనే లిరిక్స్‌కు తగ్గట్టుగా స్టెప్స్ వేస్తున్నాడు. అతని డాన్స్ చూసి మేడ పైన ఉన్న భార్య నవ్వుతూ బదులిచ్చింది. అంతేకాకుండా ఆమె కూడా కూర్చునే డాన్స్ వేస్తూ తన భర్తను మరింత ఎంకరేజ్ చేసింది.

ఇలా చాలా సేపు అతను డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సూపర్ జోడీ అని, డాన్స్ బాగా చేశారంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to pankajal instagram id)



Next Story