Viral video: పెళ్లికొడుకు పక్కనే కూర్చుని బోరున ఏడ్చేసిన వధువు!.. ఎందుకో తెలిస్తే షాక్(వీడియో)

by Kavitha |
Viral video: పెళ్లికొడుకు పక్కనే కూర్చుని బోరున ఏడ్చేసిన వధువు!.. ఎందుకో తెలిస్తే షాక్(వీడియో)
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని షాకింగ్‌గా అనిపిస్తాయి. ఇప్పుడు ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, జయమాల కార్యక్రమంలో భాగంగా వధువు వరుడి పక్కనే చాలా సేపు మౌనంగా కూర్చుని ఉంది. ఆ తర్వాత కాసేపటికి బంధువులు, స్నేహితులు ఒక్కొక్కరుగా వచ్చి వధూవరులతో ఫోటోలు దిగి వెళుతున్నారు. అయితే వధువు ముఖంలో మాత్రం ఎటువంటి హ్యాపీనెస్ కనిపించలేదు. ఇంతలో సడెన్‌గా వధువు ముందుకు ఒరిగిపోయి బోరున ఏడ్చేసింది. పక్కనే ఉన్న ఒక అమ్మాయి జరిగింది చూసి షాకైపోయింది. వధువును పైకి లేపి చూడగా ఆమె ఏడుస్తూ కనిపించింది. దీంతో వధువును చూసి ఇంకొందరు గబగబా స్టేజి పైకి వచ్చేశారు. అయితే, వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం తెలియరాలేదు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో భాగంగా వధువు సడెన్‌గా ఎందుకు అంతలా ఏడస్తున్నదని, బహుషా ఆమెకు ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తున్నారు కాబోలు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story