Viral video: నడి సముద్రంలో చేపల వేట.. ఒక్కసారిగా ఏం జరిగిందంటే?

by D.Reddy |
Viral video: నడి సముద్రంలో చేపల వేట.. ఒక్కసారిగా ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా సముద్రంలో చేపల వేటకు (Fishing) వెళ్లిన మత్స్యకారులకు వింత వింత అనుభవాలు ఎదురైన సంఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా ఇలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. ముగ్గురు మత్స్యకారులు చిన్న బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. నడి సముద్రంలోకి వెళ్లిన తర్వాత వారికి ఎదురైన వింత అనుభవానికి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral video) మారింది. ఇంతకీ ఏం జరిగింది అంటే?

న్యూజిలాండ్‌కు (New Zealand) చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ చిన్న బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. అయితే, నడి సముద్రంలోకి వెళ్లిన వారి బోటులోకి ఒక్కసారిగా 400 కిలోల డాల్ఫిన్ ఎగిరి వచ్చిపడింది. సముద్ర జలాల్లోంచి గాల్లోకి ఎగిరిన డాల్ఫిన్‌ నేరుగా.. మత్స్యకారుల బోటులోనే పడింది. ఆ సమయంలో ముగ్గురు మత్స్యకారులు బోటులోనే ఉండగా వారిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. డాల్ఫిన్‌ తాకిడికి పడవ తీవ్రంగా దెబ్బతింది. డాల్ఫిన్‌కు కూడా గాయాలయ్యాయి. దీంతో మత్స్యకారులు న్యూజిలాండ్‌ కన్వర్సేషన్‌ ఏజెన్సీని సాయం కోరగా.. డాల్ఫిన్‌ సహా మత్స్యకారులను మరో బోటు సాయంతో తీరం చేర్చారు. తీరం చేర్చాక డాల్ఫిన్‌కు వైద్యం అందించి తిరిగి సముద్రంలోకి వదిలారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed