Viral: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. గుండెపోటుతో స్టేజీ పైనే కుప్పకూలిన కళాకారుడు

by Ramesh Goud |
Viral: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం..  గుండెపోటుతో స్టేజీ పైనే కుప్పకూలిన కళాకారుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాముడి వేషం ధరించిన కళాకారుడు గుండె పోటుతో స్టేజీ పైనే కుప్పకూలాడు. ఘటన ప్రకారం షహదారా విశ్వకర్మనగర్ లో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామ్ లీలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రాముడి వేషం వేసిన 45 ఏళ్ల వ్యక్తికి తన పాత్రను ప్రదర్శిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో స్టేజీ వెనుక వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడే కుప్పకూలాడు. ఇది గమణించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. మృతుడు సుశీల్ కౌశిక్ గా గుర్తించిన పోలీసులు.. అతడు వృత్తిరిత్యా ప్రాపర్టీ డీలర్ అని, తనకు ఉన్న అభిరుచితో రామ్‌లీలా ఈవెంట్‌లలో రాముడి పాత్ర పోషిస్తుంటాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆ వ్యక్తి నటన మధ్యలో నొప్పితో బాధపడుతూ స్టేజీ వెనుక వైపు పరిగెత్తాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed