Viral: ఆటో డ్రైవర్ తిక్క కుదిరిందిగా.. రూ. 30తో పోయేదాన్ని.. రూ. 30,000 తీసుకొచ్చాడుగా

by Kavitha |
Viral: ఆటో డ్రైవర్ తిక్క కుదిరిందిగా.. రూ. 30తో పోయేదాన్ని.. రూ. 30,000 తీసుకొచ్చాడుగా
X

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గా బెంగళూరులో ఓ మహిళ రైడ్ క్యాన్సిల్ చేసిందని ఓ ఆటో డ్రైవర్ మహిళను కొట్టడమే కాకుండా ఆమె పై దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియోను పోలీసు అధికారులు చూడటంతో ఓలా డ్రైవర్ ఆర్. ముత్తురాజుని గురువారం మగాడి రోడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74 మరియు 352 కింద అభియోగాలు మోపారు. ఇక లీగల్ ఫీజుల కోసం ఏకంగా రూ. 30,000 చెల్లించాల్సి వస్తుంది. రైడ్ క్యాన్సిల్ అయితే కేవలం రూ. 20 నుంచి రూ. 30తో పోయేది. అంతకన్నా ఎక్కువ ఇంధన ఖర్చులు అయ్యేవి కావు. కానీ, ప్రస్తుతం ఏకంగా వేలకు వేలు చెల్లించాల్సి వస్తోంది.

ఇదిలా ఉంటే.. వైరల్ అయిన వీడియోని సీనియర్ పోలీస్ అధికారి చూసి.. ఇది ఆమోదయోగ్యం కాదని, మోసపూరితమైన చర్య అని, ఒక యువతిని పట్టపగలు నిందితుడు మాటలతో దుర్భాషలాడాడని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ఆయన స్పందించడంతో పోలీసులు చకచకా చర్యలు తీసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా రైడ్ క్యాన్సిల్ కావడంతో తాను కోపంలో ఉన్నానని డ్రైవర్ ఒప్పుకున్నాడు, కానీ అతడి చర్యల్ని సమర్థించుకోలేకపోయాడు. దీంతో జైలు శిక్షతో పాటు చట్టపరమైన ఖర్చులు ఎదుర్కోవడమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్ రద్దు చేయబడతాయి. కాబట్టి ఎంత కోపంలో ఉన్న మన మాటలను అదుపు పెట్టుకోకపోతే ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటాయని ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది.

(video link credits to Citizens Movement, East Bengaluru X account)

Advertisement

Next Story

Most Viewed