VIRAL : తోటి ప్రయాణికులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా మెట్రోలో ఆ పని చేస్తున్న లవర్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Kavitha |
VIRAL : తోటి ప్రయాణికులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా మెట్రోలో ఆ పని చేస్తున్న లవర్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్ట పడుతున్నారు అని చెప్పుకోవడానికే మొహమాటం పడేవారు. అలాంటిది కలుసుకోవాలంటే వామ్మో ఎవరైన చూస్తారు అని భయపడి ఇంట్లోనే ఉండేవారు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి జనరేషన్స్‌ కూడా మారుతున్నాయి. ఇంకా ఇంటెర్‌నెట్, ఆండ్రాయిడ్ ఫోన్స్, సోషల్ మీడియా ఇలా అన్ని అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యువత పూర్తిగా మారిపోతుంది. ఈ క్రమంలో గుడి, బడి , బస్టాండ్, మెట్రోలు అని తేడా లేకుండా రోడ్లనే బెడ్‌రూమ్‌లా భావించి బహిరంగా రెచ్చిపోతున్నారు. ఇక మెట్రోలు అయితే స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతున్నాయి. గతంలో ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా మళ్లీ తమ లవర్స్‌తో కలిసి బహిరంగంగానే రొమాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మెట్రో రైల్వే స్టేషన్‌లు ఇటీవల యువత రొమాన్స్ చేసుకొవడానికి అడ్డాగా మారిందని చెప్పుకొవచ్చు. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా.. లేకున్నా.. మాకేంటి అన్న చందంలో రెచ్చిపోతున్నారు. వారి పనులు చూసి అక్కడున్న వారే సిగ్గుతో మరోచోటికి వెళ్లిపోతున్నారు. అయిన కూడా ప్రేమికులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రతి రోజు వేలాది మంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు అనే విషయం తెలిసిందే. అయినా అక్కడ లవర్స్ తన చేష్టలతో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఢిల్లీ మెట్రోలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో భాగంగా.. మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు లవర్స్ సడెన్‌గా మూడ్ వచ్చిందో ఏమో కానీ ఇద్దరు ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. మెట్రోలో సాటి ప్రయాణికులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బరితెగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రోలో ఇదేం పాడు పనులు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

( video link credits to delhi.connection instagram id)

Advertisement

Next Story

Most Viewed