Viral News: విచిత్రమైన దొంగలు.. వీడియో వైరల్..

by Indraja |   ( Updated:2024-03-28 04:55:09.0  )
Viral News: విచిత్రమైన దొంగలు.. వీడియో వైరల్..
X

దిశ వెబ్ డెస్క్: మనం నిత్యం ఎక్కడో ఒక చోట దొంగతనం జరిగిందనే వార్తలు వింటూనే ఉంటాం. సాధారణంగా దొంగలు బంగారం, నగదు, విలువైన వస్తువులు దొంగిలిస్తారు. కానీ ఓ వ్యక్తి విచిత్రంగా పండ్లు దొంగిలించారు. వివరాల్లోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వెళ్తున్నారు. అప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే అక్కడే పక్కన ఓ వ్యక్తి బండి మీద పండ్లు పెట్టుకుని అమ్ముతున్నారు.

ఇక ట్రాఫిక్ లో ఉన్న బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో బైక్ వెనక కూర్చున్న వ్యక్తి ద్రుష్టి పక్కనే ఉన్న పండ్ల బండిపైన పడింది. ఓ రెండు ద్రాక్ష పండ్లు తిందామని చెయ్యి పెట్టాడు. అదే సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి బైక్ ను ముందుకు నడపడంతో రెండు ద్రాక్ష పండ్ల కోసం చెయ్యి పెట్టిన వ్యక్తి చేతికి ద్రాక్ష గుత్తి మొత్తం వచ్చింది. వెనక్కి వెళ్లి ఆ ద్రాక్షను యజమానికి ఇస్తే దొంగతనం చేస్తావా అని పొల్లుపొల్లు తిడతారు.

మూడు బాలేకుంటే నాలు తన్నినా తంతారు, ఎందుకు వచ్చిన రిస్క్ అనుకున్నాడేమో గాని నిమ్మళంగా ఆ పండ్లను తింటూ బైక్ పైన కూర్చున్నాడు. కాగా ఆ బైక్ వెనక వున్నా మరో వాహనదారుడు ఎవరో ఆ సన్నివేశాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed