- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Trending: వారెవ్వా సూపర్ డాగ్.. పనిలో యజమానికి హెల్ప్ చేస్తున్న శునకం (వీడియో వైరల్)

దిశ, వెబ్‌డెస్క్: కొందరు మన వెంటే ఉంటూ మన కోసం గోతులు తవ్వేస్తుంటారు. అలాంటి వారిని ఉద్దేశిస్తూ.. పూర్వం పెద్దోళ్లు ‘కుక్కకు ఉన్న విశ్వాసం కూడా లేకపాయే’ అంటూ ఓ నానుడిని వాడే వారు. అయితే, అచ్చం ఆ నానుడిని నిజం చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ట్విట్టర్ ‘నేచర్ ఈజ్ అమెజింగ్’ ఆఫీషియల్ అకౌంట్‌లో ఓ కుక్కను తన యజమానికి సాయం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. అయితే, ఆ వీడియోలో పంక్చర్ షాపు యజమాని టైర్లను అన్నింటిని బయట పడేస్తాడు. వాటిని కుక్క క్రమ పద్ధతిలో అమర్చి పక్కన పెడుతోంది. నిత్యం యజమానితోనే ఉంటూ ఆయనకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆ సూపర్ డాగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు యజమాని పట్ల కుక్కకు ఉన్న విశ్వాసాన్ని అభినందిస్తున్నారు. వారెవ్వా సూపర్ డాగ్ అంటూ ప్రశంసిస్తున్నారు.