Trending: ఇదెక్కడి చిత్రంరా సామి..! హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు చలాన్

by Shiva |
Trending: ఇదెక్కడి చిత్రంరా సామి..! హెల్మెట్ పెట్టుకోలేదని కారు డ్రైవర్‌కు చలాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో పలు రాష్ట్రాల పోలీసులు ఈ మధ్య కఠినంగా వ్యవహరిస్తున్నారు. బండిపై వెళ్తున్న వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్‌తో పాటు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కానీ, తాజాగా ఉత్తర‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఓ వాహనదారుడికి వింత అనుభవం ఎదురైంది. కారు నడిపిన తుషార్ సక్సేనాకు హెల్మెట్ ధరించలేదని నోయిడా ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.వెయ్యి జరిమానా వేశారు. ఈ మేరకు ఫైన్ వెంటనే చెల్లించాలని ఫోన్‌కు మెసేజ్ పంపించారు. అయితే, మొదట తనకు వచ్చిన మెసేజ్ తప్పుగా వచ్చి ఉండొచ్చిని తుషార్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, వెంటనే మెయిల్, మరో మెసేజ్ రావడంతో అది చూసి షాకయ్యాడు. చలాన్ విషయమై ట్రాఫిక్ పోలీసులను సంప్రదించగా.. విత్ అవుట్ హెల్మెట్ ఫోర్ వీలర్ నడిపినందుకు ఫైన్ వేశామని సింపుల్‌గా చెప్పారట. పైగా వెంటనే కోర్టుకు వెళ్లి ఫైన్ చెల్లించాలంటూ పోలీసులు హెచ్చరించారని తుషార్ సక్సేనా వాపోయాడు.

Advertisement

Next Story

Most Viewed