Trending: వారెవ్వా.. ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-08-13 07:56:01.0  )
Trending: వారెవ్వా.. ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పోలీసులు సాధారణ పౌరులను ఎప్పుడూ బూతులు తిడుతూ.. వారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. పలు సంఘాలు ఏదైనా ఓ సమస్యపై ధర్నాలు, నిరసనలు చేపడితే శాంతిభద్రలను దృష్టిలో ఉంచుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించడం వారి డ్యూటీ. ఈ క్రమంలోనే పరిస్థితి అదుపుతప్పితే కొన్నిసార్లు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారు. అయితే, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ రేంజ్‌లో అమలవుతుందో తెలుసుకునేందుకు చాదర్‌ఘాట్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు ఖైదీలను ఎస్కార్ట్ పోలీసులు కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్నారు. మార్గమధ్యలో వారు ఇరానీ చాయ్ తాగాలని హోటల్ నయాగ్రా వద్ద ఆగారు. ఈ క్రమంలో ఖైదీలకు కూడా పోలీసులు ఇరానీ చాయ్‌ని రుచి చూపించారు. దీంతో అక్కడున్న సాధారణ ప్రజలు ఈ వింత ఘటన చూసి అవాక్కయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందించారు.

Advertisement

Next Story