- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Great Police : పొద్దున పోలీస్... రాత్రికి ఆ అవతారం.. నువు మాములోడివి కాదంటున్న నెటిజన్స్

దిశ, వెబ్ డెస్క్ : అజయ్ గ్రేవాల్(Ajay Grewal) అనే వ్యక్తి పగలంతా పోలీస్ కానిస్టేబుల్(Police Constable) గా విధులు నిర్వహిస్తాడు. సాయంత్రం కాగానే అతని మరో అవతారం చూసి నెటిజన్స్ వాహ్.. నువు మాములోడివి కాదు గురూ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ మరి అజయ్ ఏం చేస్తాడో తెలుసుకుందాం రండి. హరియాణా రాష్ట్రానికి చెందిన అజయ్ గ్రేవాల్ ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో మామూలు కానిస్టేబుల్. పగలంతా తన విధులు నిర్వహిస్తూ.. సాయంత్రం ఉద్యోగం ముగియగానే టీచర్(Teacher) అవతారం ఎత్తుతాడు. ఆర్థికంగా వెనుకబడి, డబ్బులు పెట్టి కోచింగ్(Coaching) తీసుకునే స్థోమత లేని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతకు అజయ్ క్లాసులు చెబుతాడు. చెప్పడం అంటే అదేదో మొక్కుబడిగా చెప్పడం కూడా కాదు.. అతను చెప్పిన క్లాసులు విని ఏకంగా 3 వేల మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు అంటే అర్థం చేసుకోండి అజయ్ నిబద్ధత. యూపీఎస్సీ(UPSC), ఎస్ఎస్సీ(SSC)తో సహ పలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ లోని జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, గణితం, ఇంగ్లీష్, హిందీ వంటి సబ్జెక్టులను తన ఇంటిపై గల టెర్రస్ మీదనే బోధిస్తాడు. ఇతని డెడికేషన్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా.