- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
world most expensive shoes: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ షూ.. దీని ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?
దిశ, ఫీచర్స్ : సాధారణంగా మనం ఏదైనా షాప్ కి వెళ్లినప్పుడు షూ ధర అడిగితే వందలు, వేలల్లో చెబుతుంటారు. డబ్బున్న వారైతే అయితే లక్షలు పోసి కొనుక్కుంటారు కానీ ఇక ఈ షూ కొనాలంటే మిలియనీర్లు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వీటిధర అక్షరాల రూ. 164 కోట్లు.. ఏంటీ అంత ఖరీదా అని అనుకుంటున్నారా.. మరి ఇవి ఇంత ధర పలకడానికి ఓ ప్రత్యేకమైన కారణమే ఉందండోయ్. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం..
దీనిని ఇటాలియన్ షూ డిజైనర్ తయారు చేశారు. మూన్ స్టార్ షూస్ చాలా ఖరీదైనవి. 2019 లో జరిగ దుబాయ్‌లో జరిగిన మేడ్ ఇన్ ఇటలీ, డిజైన్డ్ ఇన్ ఎమిరేట్స్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఈ అద్భుతమైన షూ ప్రదర్శించబడింది.
ఈ షూ ధర రూ. 19.9 మిలియన్ డాలర్లు అని చెబుతున్నారు అంటే మన లెక్క ప్రకారం.. రూ. 164 కోట్లు. మిలియనీర్లు కూడా ఈ షూ కొనాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. అందుకే ఇవి వరల్డ్ లోనే కాస్టిలీగా షూ గా పేరు పొందింది. మూన్ స్టార్ షూస్ మడమల భాగంలో బంగారాన్ని అమర్చారు. అంతే కాకుండా 30-క్యారెట్ వజ్రాలను కూడా వాడారు. వీటితో పాటు మరో షాకింగ్ విషయం కూడా ఉంది. ఈ షూ తయారీలో ఉల్క ముక్కను కూడా ఉపయోగించారు. ఆ ఉల్క పదార్ధం 1576 సంవత్సరానికి చెందినది. ఇంత విలువైన షూ తయారు చేయడానికి 9 నెలలు సమయం పట్టిందని దుబాయ్ మీడియా వెల్లడించింది.