దారుణం.. కూతురు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి

by Mahesh |
దారుణం.. కూతురు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: అంబులెన్స్‌ను నిరాకరించడంతో కూతురు మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తీసుకెళ్లిన విషాద సంఘటన మధ్యప్రదేశ్ లోని షాడోల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 13 ఏళ్ల బాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందింది. అయితే తన కూతురు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి సిబ్బందిని కోరగా వారు.. అంబులెన్స్‌ను పంపడానికి నిరాకరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో.. తన కుమార్తె మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లవలసి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed